Home  »  TV News  »  నాకు భజన రాదు...అందుకే నాకు అవకాశాలు రాలేదు!

Updated : Apr 11, 2026

బుల్లితెర మీద చలాకి చంటి అంటే తెలియని వారు లేరు. జబర్దస్త్ లాంటి కామెడీ షోస్ తో పాటు భీమిలి కబడ్డీ జట్టు వంటి ఎన్నో మూవీస్ లో నటించాడు అలాగే బిగ్ బాస్ సీజన్ 6 కి వెళ్ళాడు. ఇక రీసెంట్ ఆట షోలో కనిపిస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు పంచులు వేస్తున్నాడు. అలాంటి చంటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. "నాకు భజన చేయడం రాదు. నాకు అవకాశాలు రాకపోవడానికి కారణం కూడా అదే. నాకు మధ్యలో బ్రేక్ రావడానికి , సినిమాలు పడకపోవడానికి కారణాలు కూడా అదే. భజన కొట్టే ఓపిక లేదు. నీ మీద నీకు కాన్ఫిడెంట్ ఉంటే ఇంకొకడి దగ్గరకు వెళ్లి భజన కొట్టాల్సిన అవసరం లేదు. మహా ఐతే ఎం చెప్తాము ఇష్టం ఉంటె ఉందని లేదంటే లేదని చెప్తాము అంతే కదా నువ్వు తప్పు చేస్తే చేసావని చెప్తాం.  ఆ నిమిషానికి వాళ్ళు తిట్టుకుంటారేమో కానీ ఒక పది నిమిషాలు వాళ్ళు ఒక్కళ్ళే ఆలోచించుకుంటే అప్పుడైనా ఎందుకు ఆ మాట అన్నాడో తెలుస్తుందిగా అప్పుడైనా నిజం బయటకు వస్తుందిగా అది చాలు. ఏ పాయింట్ ఏమైనా ఎం జరిగినా నేను మారాను. మారే ప్రసక్తే లేదు. భజన ఎప్పుడు కొట్టాలో తెలుసా నీకు గడవకపోతే భజన చేయాలి. నిన్ను నువ్వు తగ్గించుకుని భజన చేయాలి. నీ వల్ల కాదు అనుకున్నప్పుడు భజన కొట్టాలి. లేదు నా మోకాలిలో ఇంకా సత్తా ఉంది కొండ ఎక్కగలను అనుకున్నప్పుడు ఏమీ అడగక్కర్లేదు.  

మోకాలు బాలేనప్పుడు నన్ను కొండ ఎక్కించు అని అడుగుతావ్. దేవుడు కూడా అదే అంటాడు ఎక్కి వచ్చేయి నేను ఉన్నాగా అంటాడు. నన్ను ఎక్కించు దేవుడా అని కింద కూర్చుంటే ఎవరు ఎక్కిస్తారు. నీలాంటి వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. నేను ఆశలు పెట్టుకోను. వచ్చింది చేద్దాం, రానిది నేర్చుకుందాం అంతే . రాధికా గారిని చూసినప్పుడు రాజా విక్రమార్క సినిమా గుర్తొచ్చింది.

ఆవిడ మీద పంచులు వేస్తె తీసుకుంటారో లేదో అనుకున్నా. నా మీద రివర్స్ పంచులు వేసినప్పుడు ఆ మన టైపు అనుకుని నేను పంచులు వేస్తున్నా. గొప్పవాళ్ళు ఎలా అవుతారంటే నీకేమనిస్తే ఆ పంచులు వేసేయ్ అన్నారు రాధికా గారు. అది మంచి విషయం. ఇక్కడ ఎంటర్టైన్మెంట్, కంటెంట్ ఇవ్వడం. అంటే పంచులు వేస్తే తీసుకోవడం కూడా ఉన్నవాళ్లే గొప్పోళ్ళు. మేము చేసిన తప్పులు మీరు చేయొద్దు అంటూ సుధీర్ కి చెప్పాను   " అని అన్నాడు చలాకి చంటి.
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.